XtGem Forum catalog
Teluguworld.wap.sh









విడుదల తేదీ : 07 నవంబర్ 2014
TeluguArea.com : 3.25/5
దర్శకుడు : చిన్ని కృష్ణ
నిర్మాత : అమ్మిరాజు కానుమిల్లి
సంగీతం : శేఖర్ చంద్ర
నటీనటులు : అల్లరి నరేష్, కార్తీక, మోనాల్ గజ్జర్, బ్రహ్మానందం...

ప్రస్తుతం అల్లరి నరేష్ కెరీర్ కొంచం నెమ్మదిగా నడుస్తుంది. ఇటివల కాలంలో అతను నటించిన సినిమాలు సరైన విజయాలు అందుకోలేదు. హిట్ కోసం ‘బ్రదర్ అఫ్ బొమ్మాళి’ అంటూ డిఫరెంట్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కార్తీక, మోనాల్ గజ్జర్, బ్రహ్మానందం నటించిన ఈ సినిమా నేడు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది..? నరేష్ ఆశిస్తున్న విజయం అందించిందా..? లేదా..? ఇప్పుడు చూద్దాం.

కథ :
రాంకీ(అల్లరి నరేష్) మరియు లక్కీ(కార్తీక) అనే ఇద్దరు కవలలకు చెందిన కథ ఇది. రాంకీ చాలా సరదాగా ఉండే సాధారణ వ్యక్తి. అతని చెల్లెలు కార్తీక మాత్రం డేరింగ్ & డాషింగ్, టామ్ బాయ్ తరహా క్యారెక్టర్ అనమాట. ఒకరోజు మోనాల్ గజ్జర్ ను చూసిన రాంకీ ఆమెతో ప్రేమలో పడతాడు. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్తాడు.

చెల్లెలు లక్కీ పెళ్లి అయ్యేంత వరకూ నీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ప్రసక్తే లేదని రాంకీ తండ్రి ఓ కండిషన్ పెడతాడు. ఇక గత్యంతరం లేని పరిస్తితులలో చెల్లెలికి ఓ సరైన జోడిని వెతకడం ప్రారంభిస్తాడు రాంకీ, వచ్చిన ప్రతి సంభందాన్ని కార్తీక చెడగొడుతుంది. ఆ సమయంలో ఓ అబ్బాయి(హర్షవర్ధన్ రాణే)ను ప్రేమిస్తున్నానని, ఎట్టి పరిస్థితులలో ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. ఇప్పుడే సినిమాలో ఒక ట్విస్ట్, మరో 15 రోజులలో చెల్లెలు ప్రేమించిన వ్యక్తికి పెళ్లి జరుగుతుందనే విషయం రాంకీ తెలుసుకుంటాడు.

ఇప్పుడు రాంకీ ఏం చేశాడు..? తన చెల్లెలు కోరుకున్న విధంగా ప్రేమ వివాహం చేశాడా..? లేదా..? రాంకీ ప్రేమకథ సక్సెస్ అయ్యిందా..? లేదా..? అనే ప్రశ్నలకు సమాధానాలు వెండితెరపై సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్ :
అల్లరి నరేష్, కార్తీకల మధ్య కామెడీ యాంగిల్ ను తెరపై చాలా బాగా ఆవిష్కరించారు. సినిమాలో ప్రతి సన్నివేశం మరియు ఆ సన్నివేశాలకు అనుగుణంగా డిజైన్ చేసిన కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. కామెడీ జోనర్ సినిమాలు చేయడంలో తను మాస్టర్ అని మరోసారి అల్లరి నరేష్ నిరూపించాడు. చాలా సన్నివేశాలలో స్క్రిప్ట్ డిమాండ్ మేరకు కార్తీక పాత్ర తన క్యారెక్టర్ ను డామినేట్ చేసినా, రాంకీ క్యారెక్టర్ లో చాలా సిన్సియర్ గా నటించాడు. లక్కీ క్యారెక్టర్ కు కార్తీక తనవంతుగా న్యాయం చేసింది. ఆ క్యారెక్టర్ కు కార్తీక ఎంపిక పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు, లక్కీ పాత్రలో ఒదిగిపోయి నటించింది. డాన్సులు బాగా చేసింది.

సినిమా కథను చాలా ఆసక్తికరంగా ఉంది, రచయితలు కథను చక్కగా రాశారు. బ్రదర్ – సిస్టర్ రిలేషన్షిప్ ను కామెడీ యాంగిల్ లో చూపించిన విధానం బాగుంది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైనింగ్ సాగిపోతుంది. సెకండ్ హాఫ్ ను చక్కగా డీల్ చేశారు. కామెడీ, రొమాన్స్ మరియు ఫన్ ఎలిమెంట్స్ ను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. ఫన్నీ బాస్ గా వెన్నెల కిషోర్ తన పాత్రను సమర్దవంతంగా పోషించాడు. అల్లరి నరేష్ స్నేహితులుగా శ్రీనివాస రెడ్డి గ్యాంగ్ సినిమా అంతటా పంచ్ డైలాగులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.

మైనస్ పాయింట్స్ :
తెలుగు చిత్రసీమ దర్శకనిర్మాతలు, హీరోలు సూపర్ హిట్టయిన ఒకే కమర్షియల్ ఫార్ములాతో సినిమాలు తీస్తూ సేఫ్ గేమ్ ఆడడానికి ప్రయత్నిస్తారని ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా సాగిన తర్వాత సెకండ్ హాఫ్ ఇతర కమర్షియల్ సినిమాల తరహాలో అదే రొటీన్ డ్రామా మొదలవుతుంది. సినిమాలో బ్రహ్మానందం ఎంటర్ అయిన తర్వాత కథ ఎలా ఉండబోతుంది ప్రేక్షకులకు తెలిసిపోతుంది. కామెడీ బాగున్నా, ప్రేక్షకులకు ఆ కామెడీ పెద్దగా కిక్ ఇవ్వదు.

ఇక క్లైమాక్స్ అయితే చాలా రొటీన్ గా ఉంటుంది, అలాగే హడావుడిగా క్లైమాక్స్ పూర్తవుతుంది. హీరోయిన్ మోనాల్ గజ్జర్, హర్షవర్ధన్ రాణేలు ఈ రొటీన్ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ లో పెద్దగా నటించడానికి, చేయడానికి అవకాశం లేకుండా పోయింది. కొద్దిసేపు నవ్వించిన అలీ, ఆ తర్వాత్ మాయమయ్యాడు. సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు నటించినా, వారిని సరిగా ఉపయోగించుకోలేదు. ఒక్కరికీ ప్రాధాన్యత గల పాత్రలు లభించలేదు. కోన వెంకట్ పాత్రలో బ్రహ్మానందం కామెడీ కూడా క్లిక్ అవ్వలేదు. బ్రహ్మి నటించిన సన్నివేశాలు రొటీన్ గా ఉన్నాయి. చాలా సినిమాలలో ఆ తరహా సన్నివేశాలు ప్రేక్షకులు చూశారు.

సాంకేతిక విభాగం :
నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. సినిమా బడ్జెట్ తో కంపేర్ చేస్తే, అవుట్ పుట్ చాలా బాగుంది. సినిమాను అందంగా తీర్చిదిద్దారు. సినిమాటోగ్రఫీ వలన ప్రత్యేక ప్రయోజనం ఏమి కలగలేదు, రొటీన్ గా ఉంది. డైలాగుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ప్రతి డైలాగ్ బ్రిలియంట్ గా రాశారు. వన్ లైన్ పంచ్ డైలాగులు బాగా నవ్వించాయి. ముఖ్యంగా అల్లరి నరేష్ స్నేహితులకు రాసిన డైలాగులకు థియేటర్లో మంచి స్పందన వస్తుంది. శేఖర్ చంద్ర సంగీతం పర్వాలేదు. పాటలను డీసెంట్ గా చిత్రీకరించారు.

దర్శకుడు చిన్నికృష్ణ తన బాధ్యతను సమర్దవంతంగా నిర్వర్తించాడు. ఆసక్తికరమైన కథను అంతే ఆసక్తికరంగా తెరపై ఆవిష్కరించాడు. సినిమా ప్రారంభం నుండి ఇంటర్వెల్ వరకూ ఒకటే టెంపో మైంటైన్ చేశాడు. సెకండ్ హాఫ్ లో కొంచం టెంపో మిస్ అయ్యింది. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బాగోలేదు అని చెప్పడం లేదు. ఓవరాల్ సెకండ్ హాఫ్ రొటీన్ గా ఉంది అని చెప్తున్నాం అంతే.

తీర్పు :

‘బ్రదర్ అఫ్ బొమ్మాళి’ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే .. ఇంటరెస్టింగ్ కథ మరియు కొన్ని కామెడీ సన్నివేశాలతో సరదాగా సాగిపోయే అల్లరి నరేష్ మార్క్ ఎంటర్టైనర్. సినిమా ఫస్ట్ హాఫ్, అల్లరి నరేష్, కార్తీక పెర్ఫార్మన్స్ లు సినిమాకి ప్లస్ పాయింట్స్. సెకండ్ హాఫ్ లో రొటీన్ కామెడీ, ప్రేక్షకులు ఊహించదగిన కథనం, బ్రహ్మానందం ప్రేక్షకులను అంతగా ఎంటర్టైన్ చేయలేకపోయాయి. ఈ వీకెండ్ లో సరదాగా మీరు ఈ సినిమాను చూడొచ్చు.




TeluguWorld.wap.sh:-3.25/5




Users Online


937